ఇర్లపాడు (నాదెండ్ల): మండల పరిధిలోని ఇర్లపాడు గ్రామ వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. రైతులు తిరుపతయ్య, రమేష్, మస్తాన్ పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటార్లు, డ్రిప్ పైపులను ధ్వంసం చేశారు. అనంతరం పైపులను అక్కడే తగులబెట్టి, మోటార్లలోని విలువైన రాగి వైరును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు ₹50,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. కాగా, ఈ దుశ్చర్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

