చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ప్రైవేట్ బస్సు-ఆటో ఢీకొని ఏడుగురు దుర్మరణం
చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పుట్టినరోజు వేడుకకు హాజరై కొండమంజులూరు నుంచి వేలూరుకు 14 మందితో వెళ్తున్న ఆటోను.. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని డీఎస్పీ బి. హనుమంతరావు వెల్లడించారు; గాయపడిన పలువురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

