చిలకలూరిపేట:పట్టణంలో రాత్రి చోటుచేసుకున్న ఘోర ఆటో ప్రమాద బాధితులను తక్షణమే ఆదుకుని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. బాధితులకు తక్షణ పరిహారం అందించాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు
నిరసనను చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి కళామందిర్ సెంటర్, చైత్ర సెంటర్ మీదుగా నరసరావుపేట సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం నరసరావుపేట సెంటర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు.

