చిలకలూరిపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న SIR ప్రక్రియను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆమె, పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

