వినుకొండ: శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కారు-బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వినుకొండ పట్టణం శృంగారపు వనం ప్రాంతానికి చెందిన మురికిపూడి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

