ప్రత్తిపాటి పుల్లారావు మీడియా పాయింట్స్
· ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచారం మంగళవారం చిలకలూరిపేట పట్టణంలోని 12, 17, 18, 25 వార్డులలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
· ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో గడిచిన రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
· అర్హులైన లబ్ధిదారులకు 4,000 నుండి 15,000 రూపాయలవరకు పెన్షన్లు సక్రమంగా అందుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ అందుకోని అర్హులు మరియు కొత్తగా అర్హత సాధించిన వారు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటున్నారు.
· నూతన పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు.
· ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి మరియు జగన్ మోహన్ రెడ్డి వర్గభేదాలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, కానీ ప్రజలు మంచి-చెడులను స్పష్టంగా గుర్తించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేయడమైనది.

