చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద హసీనా హత్య కేసులో న్యాయం చేయాలంటూ బాధితురాలి తల్లి నిరసన చేపట్టారు. పోలీసులు ఇప్పటికే నిందితుడు బాలు సైదులును అరెస్ట్ చేసినప్పటికీ, కఠినంగా శిక్షించి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో తన కుమార్తెను కిరాతకంగా హత్య చేసి తమ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాడని కన్నీటి పర్యంతమయ్యారు. కష్టపడి బి.టెక్ చదివించిన కుమార్తెను కోల్పోయిన తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తన రెండో కుమార్తెకు రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

