చిలకలూరిపేట:
స్థానిక రోహిణి డిగ్రీ కళాశాలలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ సీఐ పి. రమేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సులో ఎస్సై హజరత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

