Palnaduspeed.in | Telugu Local News App Latest News
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుపల్నాడు జిల్లా

​మాచవరంలో కలకలం: వైసీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం.. ఎస్సై, ప్రత్యర్థుల వేధింపులే కారణమంటూ ఆరోపణ!​


పల్నాడు జిల్లా మాచవరం మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకుడు బొంత పెద్ద గురవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
​ఘటన నేపథ్యం & ఆరోపణలు:
గత 2023లో జరిగిన ఓ గొర్రెల వివాదం కేసు విషయమై తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని బాధితుడు ఆరోపించారు. ఆ కేసును రాజీ చేసుకోవాలంటూ మాచవరం ఎస్సైతో పాటు ప్రత్యర్థి పార్టీకి చెందిన చల్లగుండ్ల బిక్షమయ్య, నంబుల గంగాద్రి, నంబూల సింగరయ్య, చల్లగుండ్ల శ్రీకాంత్, నన్నపనేని గంగ ప్రసాద్‌లు గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మానసికంగా వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
​పరిస్థితి విషమం:
పోలీసులు, ప్రత్యర్థుల నుంచి వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్ద గురవయ్య పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

రోహిణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు

Palnadu Speed News

బావ సంవత్సరరికం వేళ బావమరిది బలవన్మరణం

Palnadu Speed News

నాదెండ్ల మండలం: ఇర్లపాడులో దుండగుల ఆగడాలు.. మోటార్లు, డ్రిప్ పైపులు ధ్వంసం

Palnadu Speed News

Leave a Comment