చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పిడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ‘KSSR క్రాకర్స్’ షాపులో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో లోపలే ఉన్న యజమాని బట్టలకు నిప్పంటుకోవడంతో, ప్రాణభయంతో ఆయన బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో క్రాకర్స్ షాపుల వద్ద భద్రతా ప్రమాణాలు, అధికారుల తనిఖీలపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా, ముందస్తుగానే ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

