Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లారాజకీయం

పట్టణంలోని 12, 17, 18, 25 వార్డులలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమమం

 ప్రత్తిపాటి పుల్లారావు మీడియా పాయింట్స్

·  ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచారం మంగళవారం చిలకలూరిపేట పట్టణంలోని 12, 17, 18, 25 వార్డులలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

·    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్, మరియు మంత్రి నారా లోకేష్  నాయకత్వంలో గడిచిన రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

·  అర్హులైన లబ్ధిదారులకు 4,000 నుండి 15,000  రూపాయలవరకు పెన్షన్లు సక్రమంగా అందుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ అందుకోని అర్హులు మరియు కొత్తగా అర్హత సాధించిన వారు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటున్నారు.

·  నూతన పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు.

·  ప్రతిపక్ష  వైఎస్ఆర్ సిపి మరియు జగన్ మోహన్ రెడ్డి వర్గభేదాలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, కానీ ప్రజలు మంచి-చెడులను స్పష్టంగా గుర్తించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేయడమైనది.

Related posts

రహమత్ నగర్‌లో వీధి కుక్కల బీభత్సం.. “కుక్కల బెడద నుంచి మాకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు?”

Palnadu Speed News

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

Palnadu Speed News

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, MRPS నిరసన ర్యాలీ

Palnadu Speed News

Leave a Comment