చిలకలూరిపేట: పట్టణంలోని మారుతీనగర్ ఎరుకల కాలనీకి చెందిన ఉప్పలపాటి బాలరాజు (32) ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళామందిర్ సెంటర్లోని పకోడీ బండి వద్ద పనిచేసే ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో బావ సంవత్సరరికం జరుగుతున్న సమయంలోనే తీవ్ర మద్యం మైకంలో ఉన్న బావమరిది బాలరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

