నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన కొరివి ఎలీషాబాబు గ్రామీణ రెవిన్యూ అధికారి (వి ఆర్ ఓ)సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత 15 ఏళ్లుగా తాను ఒక స్థలంలో నివాసం ఉంటున్నట్లు చూపుతూ వి ఆర్.ఓ సంతకం ఫోర్జరీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్‌ను ఈ నెల 10న అతను ఒక బ్యాంకులో సమర్పించాడు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు నాదెండ్ల VRO అబ్దుల్ బాషాకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీయగా తాను ఆ సర్టిఫికెట్‌పై సంతకం చేయలేదని వి ఆర్ ఓ తేల్చి చెప్పారు. దీంతో వి ఆర్ ఓ అబ్దుల్ బాషా ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్. వెంకటేశ్వరరావు నిందితుడు ఎలీషాబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
next post

