Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థినుల కోసం నేరాలు, సైబర్ సెక్యూరిటీ మరియు బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్ మాట్లాడుతూ… ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం, చట్టపరమైన హక్కులు, అత్యవసర సమయాల్లో పోలీసుల సహకారం పొందే విధానాలను ఆయన వివరించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలపాలని స్పష్టం చేశారు. అనంతరం బాలికల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఐ రమేష్‌ను పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు మహమ్మద్ అస్లామ్, షాహీన, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

Related posts

🔥 పల్నాడు స్పీడ్ న్యూస్ | చిలకలూరిపేటలో భారీ అగ్నిప్రమాదం! 🚨

Palnadu Speed News

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి

Palnadu Speed News

శ్రీ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు — పల్నాడు స్పీడ్ న్యూస్

Palnadu Speed News

Leave a Comment