చిలకలూరిపేట, ఆగస్టు 21: పట్టణంలోని రహమత్ నగర్‌లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు రోడ్లపై వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వాపోతున్నారు.
ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో కుక్కలు రహదారులపై గుంపులుగా తిరుగుతూ అటుగా వెళ్లే వారిపై ఎగబడుతున్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంబడించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందస్తుగా స్పందించి వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
“కుక్కల బెడద నుంచి మాకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు?” అంటూ రహమత్ నగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు.
previous post
next post

