యువకుడి నిజాయితీతో బాధితుడికి చేరిన ₹29 వేల నగదు
చిలకలూరిపేట, ఆగస్టు 20 : పట్టణంలోని పురుషోత్తపట్నంకు చెందిన ఏలూరి నరేంద్ర ప్రమాదవశాత్తు పోగొట్టుకున్న ₹29,000 నగదు యువకుడి నిజాయితీతో తిరిగి ఆయనకు చేరింది.గురువారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో నరేంద్ర మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, జేబులో ఉన్న నగదు ఆది ఆంధ్ర కాలనీ సమీపంలో కింద పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న బండారపు రాజీవ్ నగదును గమనించి, ఏమాత్రం దురాశ పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించాడు.చిలకలూరిపేట సీఐ పి. రమేష్ బాధితుడిని స్టేషన్‌కు పిలిపించి, రాజీవ్ చేతుల మీదుగా ₹29,000 నగదును తిరిగి అందజేశారు. యువకుడు చూపిన నిజాయితీని సీఐ అభినందించగా, నగదు తిరిగి దక్కడంతో నరేంద్ర పోలీసులకు, రాజీవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

